ఉద్యోగులకు ఐటీ విభాగం వార్నింగ్

ఉద్యోగులకు ఐటీ విభాగం వార్నింగ్
అక్రమ పద్ధతుల్లో పన్ను కట్టకుండా తప్పించుకునే ఉద్యోగులకు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. కొంత మంది తప్పుడు ట్యాక్స్ ప్లానర్స్ లేదా ట్యాక్స్ అడ్వయిజర్స్ సలహాలు విని వాస్తం గణాంకాలతో రిటర్న్‌లు దాఖలు చేయడం లేదని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఐటీ విభాగం హెచ్చరించింది. ఈ మేరకు బెంగళూరులోని ఐటీ విభాగానికి చెందిన కేంద్రీయ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఓ ప్రకటన జారీ చేసింది. నిబంధనల మేరకు చెల్లించాల్సించాల్సి ఉండగా... పన్నుల నుంచి తప్పించుకునేందుకు ట్యాక్స్ అడ్వయిజర్స్ పలు సలహాలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఐటీ విభాగం పేర్కొంది. దీంతో పలువురు ఉద్యోగులు తమ ఆదాయాన్ని తక్కువ చేసి చూపడం లేదా అధిక పన్ను మినహాయింపులను పొందేలా ట్యాక్స్ రిటర్న్ లు దాఖలు చేస్తున్నారని ఐటీ విభాగం తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడినవారిపై ఐటీ చట్టం కింద శిక్షిస్తామని హెచ్చరించింది.