పి.చిదంబరంపై చార్జ్‌షీట్
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురిపై బ్లాక్ మనీ యాక్ట్ కింద ఆదాయ పన్ను అధికారులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విదేశాల్లోని ఆస్తుల వివరాలను పి. చిదంబరం, ఆయన భార్య నళినీ, కుమారుడు కార్తి, కోడలు శ్రీనిధి వెల్లడించలేదని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జిలో రూ. 5.37 కోట్లు, అదే దేశంలో మరో చోట రూ.80 లక్షల ఆస్తితో పాటు అమెరికాలో రూ. 3.28 కోట్ల విలువైన ఆస్తులను చిదంబరం కుటుంబ సభ్యులు వెల్లడించలేదని ఆరోపించారు. ఈ వివరాలు తెలిసీ వెల్లడించలేదని చిదంబరంపై ఆరోపణ. కార్తి, చెస్ గ్లోబల్ అడ్వయిజరీ సంస్థ పేరుతో ఆస్తులు ఉన్నాయని ఐటీ శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి ఇటీవల కార్తి, ఇతరులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయగా.. ఈ నోటీసులను మద్రాస్ హైకోర్టులో చిదంబరం ఫ్యామిలీ సవాలు చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)