తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులపై కీలక ప్రకటన

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులపై కీలక ప్రకటన

తెలుగు రాష్ట్రాల్లో గత వారం జరిగిన ఐటీ దాడులపై అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, ఢిల్లీ, పూణెలో 40కి పైగా ప్రాంతాల్లో ఫిబ్రవరి 6న సోదాలు చేశామని ఐటీ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న మూడు ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీలపై రెయిడ్స్ జరిగాయి. పలు షెల్ కంపెనీలకు ఇన్ ఫ్రా కంపెనీలు సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. 2 వేల కోట్ల మేర లావాదేవీలకు పన్నులు ఎగ్గొట్టారని తేలింది. షెల్ కంపెనీలన్నీ ఇన్ ఫ్రా కంపెనీలే మెయింటైన్ చేస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఓ ఇన్ ఫ్రా కంపెనీలో భారీ మొత్తంలో నిధులు హవాలా పద్ధతుల్లో వచ్చినట్టు చెబుతున్నారు. 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షల విలువైన ఆభరణాల్ని సీజ్ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న పత్రాలు, రికార్డులతో పాటు వాట్సప్ మెసేజ్ లు, మెయిళ్లను కూడా సీజ్ చేశారు.