జడ్జి ముందుకు ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులు..

జడ్జి ముందుకు ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులు..

డేటా చోరీ కేసులో నలుగురు ఉద్యోగులను జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్‌గౌడ్‌ను అక్రమంగా నిర్బంధించారంటూ నిన్న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. దీంతో ఐటీ గ్రిడ్స్ కేసులో నలుగురు ఉద్యోగులను ఇవాళ జడ్జి ముందు హాజరుపర్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ ఏజీ బీఎస్ ప్రసాద్.. ఐటీ గ్రిడ్స్ కు చెందిన నలుగురుని విచారణ నిమిత్తం పిలిచినట్టు న్యాయమూర్తికి తెలిపినట్టు వెల్లడించారు. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదని.. విచారణకు మాత్రమే పిలిచామని వివరించనట్టు తెలిపారు. అయితే, కేసు దర్యాప్తులో జోక్యం  చేసుకోలేమాని హైకోర్టు చెప్పిందని వెల్లడించారు ఏజీ బీఎస్ ప్రసాద్.