ఐటీ గ్రిడ్స్‌ కేసులో ఇవాళ..

ఐటీ గ్రిడ్స్‌ కేసులో ఇవాళ..

తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదంగా మారిన డేటా చోరీ కేసులో విచారణలో మరింత దూకుడు పెంచింది సిట్.. మరోవైపు ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కుమార్ వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ సాగనుంది. తనపై పెట్టిన కేసును తొలగించాలని, కంపెనీపై పెట్టిన కేసులను తొలగించాలని పిటిషన్‌లో ఆయన కోరారు. మరోవైపు అశోక్ కుమార్ పిటిషన్ పై న్యాయపరంగా ఎదుర్కునేందుకు సిద్ధమైంది ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌). దీనిపై కౌంటర్ దాఖలు చేయనున్నట్టు ఇప్పటికే సిట్‌ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. ఇక ఐటీ గ్రిడ్స్‌పై కేసు నమోదైనప్పటి నుంచి పోలీసులుకు దొరకుండా అశోక్ పరారీలో ఉన్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్‌లో స్వాధీనం చేసుకున్న డేటాపై విచారణ కొనసాగిస్తోంది సిట్. ఇప్పటికే ఐటీ గ్రిడ్స్‌లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌లు, ఇతర సామాగ్రిని గోషామహల్ స్టేడియానికి తరలించిన్న సిట్ బృందం విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన డేటాను నిపుణులు సమక్షంలో అనాలసిస్ చేస్తోంది సిట్.