వైఎస్ వివేకా రాసిన చివరి లేఖ ఇదే..!?

వైఎస్ వివేకా రాసిన చివరి లేఖ ఇదే..!?

సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు ఓ లేఖ కీలకంగా మారింది. హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు ఈ లేఖను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉదయం నుంచి లేని లేఖ.. మధ్యాహ్నానికి ఎలా? వచ్చింది అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వైఎస్ వివేకానందరెడ్డి చావుబతుకుల మధ్య రాసినట్టు భావిస్తున్న ఆ లేఖలో... ''నా డ్రైవర్‌ని డ్యూటీకి త్వరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు.. ఈ లెటర్ రాసేకి చాలా కష్ట పడ్డాను.. డ్రైవర్ ప్రసాద్‌ని వదలొద్దు.. ఇట్లు వివేకానందరెడ్డి'' అని రాసి ఉంది. ఈ లెటర్ నిజంగా వివేకా రాసారా? లేఖ నిందితులు కేసు తప్పు దోవ పట్టించేందుకు రాసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వైఎస్ వివేకా రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖపై రక్తం మరకలు కూడా ఉన్నాయి.