నేరగాళ్ళు పోటీ వద్దంటే... చట్టం చేయండి

నేరగాళ్ళు పోటీ వద్దంటే... చట్టం చేయండి

నేర చరిత్ర ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకుంటే ఆ మేరకు పార్లమెంటు చట్టం చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేవలం కేసులు ఎదుర్కొంటున్నంత మాత్రాన వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఇపుడున్న చట్టాల మేరకు నిషేధించలేమని  సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇపుడున్న ప్రజాప్రాతినిధ్య చట్టాల ప్రకారం కేవలం నేరం రుజువైన కేసుల విషయంలోనే సదరు ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీపై అనర్హత ఉందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఒకవేళ క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నవారిని కూడా అనర్హులని చేయాలని అనుకుంటే.. ఆ మేరకు పార్లమెంటు చట్టం చేయాల్సి ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.