మీ పన్నులకు మేం ధర్మకర్తలం-కేటీఆర్

మీ పన్నులకు మేం ధర్మకర్తలం-కేటీఆర్

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతీపౌరుడు చెల్లించే పన్నులకు మేం ధర్మకర్తలం అని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్... ఎల్బీనగర్‌లో జరిగిన 'మన నగరం' కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ... జీహెచ్‌ఎంసీలో బాగా పనిచేస్తే ఎవ్వరూ మెచ్చుకోరు... కానీ, చెత్తా తీయకుంటే అందరూ తిడతారన్నారు. పార్కులు కబ్జాకు గురి కాకుండా అడ్డుకోండి, చెరువులను కాపాడండి, వర్షం వచ్చినప్పుడు నీరు రోడ్లపై నిలవకుండా చూడండి అని అందరూ కోరుతున్నారు. కానీ, బాధ్యత మెలగడంలేదన్నారు కేటీఆర్. 

హైదరాబాద్‌లో కోటి జనాభా ఉన్నారు... వచ్చి పోయేవారు మరో 20 లక్షల మంది ఉన్నారన్న కేటీఆర్... జీహెచ్‌ఎంసీ పరిధిలో 10 జోన్లు, 50 సర్కిళ్లను ఏర్పాటు చేస్తామని... జీహెచ్‌ఎంసీలో ప్రతి మూడు డివిజన్లకు ఓ సర్కిల్... 15 డివిజన్లకు ఓ జోన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నగరంలో 22 లక్షల కుటుంబాలు ఉన్నాయి... అందరికీ తడి, పొడి చెత్త వేరుగా వేయడానికి 45 లక్షల చెత్త బుట్టలు ఇచ్చామని గుర్తు చేసిన కేటీఆర్... అయినా  20 శాతం మంది మాత్రమే తడి, పొడి చెత్తను వేరుచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతీ మనిషి అరకిలో చెత్తా సృష్టిస్తున్నాడు... ఇలా మొత్తం 500 మెట్రిక్ టన్నుల చెత్తా తయారు అవుతోందన్నారు కేటీఆర్.