6 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు !

6 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు !

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  రేపు 'మహర్షి' సినిమా విడుదల ఉండగా ఐటీ సోదాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  ఈ సోదాలు కామన్, పెద్ద సినిమా విడుదలయ్యేప్పుడు జరుగుతుంటాయి, లైట్ తీసుకోండి అని దిల్ రాజు చెబుతున్నారు.  కానీ గత 6 గంటలుగా సోదాలు జరుగుతూనే ఉన్నాయి.  అధికారులు అన్ని రకాల లావాదేవీల్ని పరియశీలిస్తున్నారు.  ఇక దిల్ రాజు అయితే ఇప్పటి వరకు అవకతవకలు జరిగినట్టు తేలలేదని, కోర్టు అనుమతులు తీసుకునే 'మహర్షి' టికెట్ రేట్లు పెంచడం జరిగిందని  అంటున్నారు.