మంత్రుల ఇళ్లే టార్గెట్.. ఐటీ దాడుల కలకలం..!

మంత్రుల ఇళ్లే టార్గెట్.. ఐటీ దాడుల కలకలం..!

సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడుత ప్రచారం ముగుస్తున్న వేళ నేతల ఇళ్లలో ఐటీ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులో మంత్రులు, కీలక నేతల ఇండ్లే టార్గెట్‌గా సోదాలు జరుగుతున్నాయి. నేటితో కర్ణాటక, తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నేతలు భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుకున్న ఐటీ అధికారులు.. సోదాలు చేపట్టారు. మాండ్య, హసన్ నియోజకవర్గాల్లోని నేతల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారుల దాడుల్లో కోట్ల రూపాయలు పట్టుబడినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతుండగా... చెన్నైలో అర్ధరాత్రి నుంచి మంత్రులు, కీలక నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే నేతల ఇళ్లతో పాటు... మంత్రులు రాధాకృష్ణ, ఉదయ్ కుమార్ ఇళ్లపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి.