సీఎం రమేష్‌ ఆస్తులపై ఐటీ దాడుల అప్‌డేట్‌..

సీఎం రమేష్‌ ఆస్తులపై ఐటీ దాడుల అప్‌డేట్‌..

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఇళ్లపైన, ఆయనకు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగులను ఆఫీసులోనే బయటకు అనుమతించకుండా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సోదాలు కొనసాగించారు. విధుల సమయం ముగియడంతో 20 మంది ఉద్యోగులను రిత్విక్‌ కార్యాలయం నుంచి ఐటీ అధికారులు బయటకు పంపించారు.