ఐటీ రైడ్స్.. హీరో నాని ఇంట్లో, ఆఫీసులో సోదాలు..

ఐటీ రైడ్స్.. హీరో నాని ఇంట్లో, ఆఫీసులో సోదాలు..

టాలీవుడ్ స్టార్స్ టార్గెట్‌గా ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి.. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలువురు దర్శకులు, నిర్మాతలు, హీరోల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని.. దాదాపు 10 చోట్ల ఒకేసారి సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా.. ఇటు, టాలీవుడు నేచురల్ స్టార్ నాని ఇంట్లోనూ ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని హీరో నాని ఇంట్లో, కార్యాలయంలోనూ ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.