కన్నడ స్టార్ హీరో ఇంటిపై ఐటి దాడి

కన్నడ స్టార్ హీరో ఇంటిపై ఐటి దాడి

ఎన్నికల సమయంలో ఐడి దాడులు జరగడం మాములే.  కాగా, ఈసారి ఐటి డిపార్ట్మెంట్ ఎన్నికల సమయంలో పొలిటీషియన్స్ తో పాటు సినిమా స్టార్స్ ఇళ్లపై కూడా వరసగా దాడులు చేస్తున్నారు.  తాజాగా మండ్య నియోజక వర్గంలో అంబరీష్ సతీమణి సుమలతకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న హీరో దర్శన్ కు సంబంధించిన ఫామ్ హౌస్ పై ఐటి దాడులు జరిగాయి.  ఫామ్ హౌస్ లోని అన్ని ప్రాంతాలలో ఐటి అధికారులు దాడులు నిర్వహించారు.  ఈ దాడులు జరుగుతున్న సమయంలో దర్శన్ ప్రచారంలో ఉండటం విశేషం.