మహర్షి నిర్మాత ఆఫీస్ పై ఐటి దాడులు

మహర్షి నిర్మాత ఆఫీస్ పై ఐటి దాడులు

మహర్షి సినిమా నిర్మాత దిల్ రాజు ఆఫీస్ పై ఐటి దాడులు జరిగినట్టు సమాచారం అందుతుంది.  మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమా మే 9 వ తేదీన అంటే రేపు రిలీజ్ కాబోతున్న తరుణంలో ఐటి దాడులు జరగడం విశేషం. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది.  నైజాంలో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  ఎఫ్ 2 తరువాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.  ఇప్పటికే సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.