స్టార్ హీరోపై ఐటీ దాడులు !

స్టార్ హీరోపై ఐటీ దాడులు !

ప్రస్తుతం దక్షిణాదిన చాలా వేగంగా సినిమాలు చేస్తున్న స్టార్ హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు.  వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈయన ఏడాదికి నాలుగైదు సినిమాల్లో చేసేస్తున్నారు.  ఈయనకు రెమ్యునరేష్ కూడ ఎక్కువే.  అందుకే ఐటీ శాఖ అధికారుల కన్ను ఈయనపై పడింది. 

చెన్నై నగరంలోని సేతుపతి ఇళ్ళు, ఆఫీస్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారట.  అక్కడి వారిని విజయ్ యొక్క ఆదాయపు లెక్కల గురించి ఆరా తీశారట.  ఆ సోదాల్లో అధికారులు ఏం గుర్తించారనేది ఇంకా తెలియాల్సి ఉంది.  ఈ సోదాలు జరిగే సమయంలో సేతుపతి నగరంలో లేకపోవడం విశేషం.  ఇటీవలే మణిరత్నం 'నవాబ్' సినిమాలో కనిపించిన ఈ హీరో ప్రస్తుతం చిరంజీవి యొక్క 'సైరా', రజనీకాంత్ చేస్తున్న 'పెట్ట' సినిమాలో నటిస్తున్నాడు.