టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు 

టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు 

ఏపీలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మైదుకూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుధాకర్ ఇంటి నుంచి అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ కారణాలతోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని సుధాకర్‌యాదవ్‌ ఆరోపిస్తున్నారు.  ఎన్నికలకు 8 రోజుల ముందే సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.