కల్కి ఆస్తులపై కొనసాగుతున్న సోదాలు

కల్కి ఆస్తులపై కొనసాగుతున్న సోదాలు

కల్కి భగవాన్‌ ఆశ్రమాల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, ఏపీలోలోని పలు ప్రాంతాలు సహా చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఈ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. రెండ్రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో రూ.33కోట్ల విలువైన నగదు పట్టుబడిందని, ఇందులో రూ.24కోట్ల భారత కరెన్సీ, రూ.9కోట్ల విదేశీ కరెన్సీ ఉందని సమాచారం. ఇక ఏపీ, తమిళనాడు సహా ఆఫ్రికా దేశాల్లో భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారని అంటున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఆశ్రమం చుట్టూ భారీగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది.

ఒక్క తమిళనాడులోనే వెయ్యి ఎకరాలకు పైగా భూములున్నట్లు గుర్తించారు. అయితే ఇప్పుడు కల్కి భగవాన్ ఆశ్రమం, ఆస్తులపై ఐటీ దాడులు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడే ఎందుకు దాడులు చేశారు అనే విషయమై పలు వాదనలు వినిపిస్తున్నాయి. దీని వెనుక రాజకీయ కారణలేమైనా ఉన్నాయా? లేక ఎవరైనా ఉప్పందించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి ఆశ్రమం నుంచి పెద్దఎత్తున నగదు విదేశాలకు తరలిపోతోందన్న ఆరోపణలు రావడంతోనే ఐటీ అధికారులు దాడులు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.