ప్రయాణికురాలిపై ఎయిరిండియా సిబ్బంది దాడి

ప్రయాణికురాలిపై ఎయిరిండియా సిబ్బంది దాడి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా సిబ్బంది అత్యుత్సాహం చూపించారు. ప్రదర్శన కోసం హైదరాబాద్ వచ్చిన ఇటాలియన్ డీజే పై దాడి చేశారు. విమానం ఆలస్యంపై నిలదీసినందుకు ఆమె చెంప చెల్లుమనిపించారు. దీనిపై శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదు. నాలుగురోజుల క్రితం ప్రదర్శన కోసం ఆమె నగరానికి వచ్చింది. తనపై ఎయిరిండియా సిబ్బంది దాడి చేశారని బాధితురాలు ట్విట్టర్‌లో ఎయిరిండియాకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.