షేర్‌ మార్కెట్లకు మళ్ళీ ఇటలీ భయాలు

షేర్‌ మార్కెట్లకు మళ్ళీ ఇటలీ భయాలు

ఉదయం ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. యూరోలో కూడా అదే ట్రెండ్‌ అనుకున్నారు. కానీ ఇటలీ ప్రభుత్వం తన బడ్జెట్‌ లోటును గత ఏడాది కంటే మూడు రెట్లు అధికంగా ఉంచేందుకు రెడీ అవడంతో గొడవ మొదలైంది. యూరోపియన్‌ కమిషన్‌ దీనికి ససేమిరా అంది. దీంతో యూరో మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. చాలా సూచీలు ఒకటిన్నర శాతంపైగా నష్టపోయాయి. యూరో మార్కెట్లలో అమ్మి.. అమెరికా ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. దీంతో డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ కూడా పెరిగింది. మరోవైపు అమెరికా మార్కెట్లు కూడా నిస్తేజంగా ప్రారంభమయ్యాయి. డాలర్‌ బలంతో షేర్ సూచీలు నిన్నటి స్థాయిల వద్దే ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌ సూచీ నష్టాల్లో ట్రేడవుతోంది.