ఐటీసీ ఛైర్మన్‌ దేవేశ్వర్ కన్నుమూత..

ఐటీసీ ఛైర్మన్‌ దేవేశ్వర్ కన్నుమూత..

ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్‌(72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం మృతిచెందారు. వైసీ దేదేశ్వర్... వైసీడీగా కార్పొరేట్‌ రంగానికి సుపరిచితులు. 1947 ఫిబ్రవరి 4వ తేదీన లాహోర్‌లో జన్మించిన ఆయన.. ఢిల్లీ, ఐఐటీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థి. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. 2011లో ఆయన పద్మభూషణ్‌ అవార్డును అందుకొన్నారు. ఐటీసీని ఒక ఎఫ్‌ఎంసీజీగా మలిచిన ఘనత దేవేశ్వర్‌కే దక్కుతుంది. భారతీయ కార్పొరేట్‌ చరిత్రలో సుదీర్ఘకాలం ఒక దిగ్గజ కంపెనీకి ఛైర్మన్‌గా కొనసాగారు దేవేశ్వర్‌. 2017 వరకు ఆయన ఐటీసీకి సీఈవోగా కూడా పనిచేశారు. 2018 జనవరిలో ఐటీసీ ఆయన్ను 2022 వరకు ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. 1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్... ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ 1996 నాటికి ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌ స్థాయికి చేరుకోవడానికి ఆయన ఎంతో కృషి చేశారు.