రెడ్డికి బదులుగా కపూర్!

రెడ్డికి బదులుగా కపూర్!
'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్ కొత్త ట్రెండ్ సృష్టించాడు దర్శకుడు సందీప్ వంగా. ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంత పెరిగిపోయింది. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తమిళంలో రీమేక్ మొదలుపెట్టారు. ఈ సినిమా ద్వారా స్టార్ హీరో విక్రమ్ తనయుడు దృవ్ పరిచయం కానున్నాడు. ఈ సినిమాకు 'వర్మ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో హీరో పాత్ర పేరు అర్జున్ వర్మ. అర్జున్ అనే పేరుని మార్చడానికి మాత్రం ఇష్టపడడం లేదు. ఇప్పుడు హిందీలో కూడా ఇదే పేరుని కంటిన్యూ చేస్తున్నారు. అయితే అక్కడ హీరో పాత్ర పేరు అర్జున్ కపూర్ గా పెడుతున్నారు. సినిమా టైటిల్ కూడా అదే పేరుతో ఉంటుందని సమాచారం. హీరో అర్జున్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించడానికి కారణం కూడా అతడి పేరుని టైటిల్ గా పెట్టడమనే చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతోన్న అర్జున్ కపూర్ త్వరలోనే ఈ రీమేక్ లో నటించబోతున్నాడు.