క్లినికల్ ట్రైల్స్.. పెళ్లికాని యువతికి గర్భం

క్లినికల్ ట్రైల్స్..  పెళ్లికాని యువతికి గర్భం

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెళ్లి కాని యువతిపై ఓ ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు క్లినికల్ ట్రైల్స్ జరిపారు. ఉపాధి శిక్షణ కోసం కామారెడ్డి నుంచి వచ్చిన యువతిపై జరిపిన ప్రయోగం వికటించింది. దీంతో అమీర్ పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి నిర్వాహకులు పరారయ్యారు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు.