బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జెపి నడ్డా

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జెపి నడ్డా

బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాజీ కేంద్ర మంత్రి జె పి నడ్డా నియమితులయ్యారు. ఆయన ఆర్నెల్ల పాటు ఈ పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు. హోమ్ మంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. మొదటి మోడీ సర్కారులో నడ్డా కేంద్ర ఆరోగ్య మంత్రిగా పని చేశారు.

59 ఏళ్ల నడ్డా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ శ్రేణుల్లో అద్భుతమైన వ్యూహనిపుణుడిగా నడ్డాకు మంచి పేరుంది. మొదటిసారి మోడీ ప్రభుత్వం ఏర్పడినపుడు జెపి నడ్డా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. కానీ అప్పుడు అమిత్ షాను బీజేపీ జాతీయాధ్యక్షుడిని చేశారు.