ఆయనకు స్పెల్లింగ్‌ నేర్పించండిరాబాబూ..

ఆయనకు స్పెల్లింగ్‌ నేర్పించండిరాబాబూ..

సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందించే ప్రముఖ నవలా రచయిత్రి జేకే రోలింగ్.. ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓ ఆటాడుకున్నారు. 'ఆయనకెవరైనా స్పెల్లింగ్‌ నేర్పించండిరా బాబూ' అని ఎద్దేవా చేశారు. ఇంతకీ విషయమేంటంటే.. తానో గొప్ప  రచయితనని, అత్యధికంగా అమ్ముడైన అనేక పుస్తకాలను తాను రచించానని చెబుతూ.. ట్రంప్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఐతే ఈ ట్వీట్‌ మధ్యలో.. PORE అనే ఇంగ్లీష్‌ పదానికి బదులుగా POUR అని టైప్‌ చేశారు. అంతే.. ఈ ట్వీట్‌ చూసిన రోలింగ్‌ లింక్‌ ట్వీట్‌ చేస్తూ ట్రంప్‌ను ఓ ఆటాడుకున్నారు. 'PORE పదాన్ని ఎలా రాయాలో ఆయనకు నేర్పించండి' అంటూ లైటర్‌ వెయిన్‌లో కౌంటర్‌ ఇచ్చారు. ఇది జరిగిన కాసేపటికి ట్రంప్‌ తన ట్వీట్‌లో తప్పును సరిదిద్దినప్పటికీ.. అంతకుముందు ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.