పోలీసులతో వాగ్వాదానికి దిగిన జడేజా భార్య... 

పోలీసులతో వాగ్వాదానికి దిగిన జడేజా భార్య... 

గుజరాత్ రాజ్‌కోట్‌లోని పోలీసు కానిస్టేబుల్‌తో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య వాగ్వాదానికి దిగింది. ఆవిడను మాస్క్ ధరించకపోవటానికి కారణం అడిగినందుకు ఈ రచ్చ జరిగిందని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి పోలీసుల తనిఖీల్లో జడేజా కారును ఆపారు. అప్పుడు అతను మాస్క్ ధరించి కారు నడుపుతున్నాడు. కానీ అతని భార్య రివాబా మాత్రం మాస్క్ ధరించలేదు అని ఓ పోలీస్ అధికారి చెప్పారు. అయితే రివాబా ముసుగు ధరించలేదని గమనించిన లేడీ హెడ్ కానిస్టేబుల్ సోనాల్ గోసాయ్ ప్రశ్నించడంతో రివాబా ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగింది. దాంతో లేడీ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాతాధికారులకి సమాచారం అందించింది. మరోవైపు రివాబా కూడా.. తనతో కానిస్టేబుల్‌ అతిగా వ్యవహరించిందని పోలీసులకి ఫిర్యాదు చేయడంతో  ఈ విషయం డిప్యూటీ పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్ళింది. ఇక ఈ వాగ్వాదం జరిగే సమయం లో సోనాల్ గోసాయ్ కొంత అస్వస్థకు గురవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి అరగంట తర్వాత డిశ్చార్జ్ అయ్యింది. అయితే ఈ విషయం పై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఓ అధికారి తెలిపారు.