ఏపీలోనూ క్లీన్ స్వీప్ చేస్తాం...!

ఏపీలోనూ క్లీన్ స్వీప్ చేస్తాం...!

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు... టి.టీడీపీ మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చిన జగదీష్‌రెడ్డి... చంద్రబాబు చెప్పిన ప్రకారం కర్ణాటక ఫలితాలు పునరావృతమవుతాయి... కానీ, ఆంధ్రప్రదేశ్‌లోనూ అంటూ సెటైర్లు వేశారాయన. కేసీఆర్... టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటిస్తే... ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందంటూ దీమా వ్యక్తం చేశారాయన. చంద్రబాబు పగటి కలలు కంటున్నారంటూ మండిపడ్డ జగదీష్‌రెడ్డి... తెలంగాణ రాష్ట్రంలో సైకిల్ రెండు చక్రాలు ఊడిపోయి... ఆంధ్రలో మరొక చక్రం ఉడిపోవడానికి సిద్ధంగా ఉందంటూ జోస్యం చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించానని చంద్రబాబు చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారంటూ మండిపడ్డారు జగదీష్‌రెడ్డి... నగరాన్ని నిర్మించడం ఏ ఒక్కరి చేతిలో లేదని... హైదరాబాద్ నగరానికి భూమిపూజ చేసిన నిజాం కూడా ఏనాడు నగరాన్ని నిర్మించానని గొప్పగా చెప్పుకోలేదన్నారు.