జగన్‌ సంచలన నిర్ణయం.. రూ.7 లక్షల పరిహారం

జగన్‌ సంచలన నిర్ణయం.. రూ.7 లక్షల పరిహారం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా.. ఆ  మొత్తాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహ్యతలకు సబంధించి కలెక్టర్లు తమ జిల్లాల్లోని డేటాను పరిశీలించి అర్హులైన రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం అందజేయాలని సూచించారు. 

ఇక.. 'స్పందన' కార్యక్రమంలో వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండాలని ఆదేశించిన జగన్‌.. ఎట్టిపరిస్థితుల్లోనూ కలెక్టర్లు ఈ కార్యక్రమానికి గైర్హాజరవకూడదని అన్నారు. వినతులు సమర్పించిఏ అర్జీదారులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని.. సమస్య ఎప్పటిలోగా పరిష్కారమవుతుందో ఆ రశీదు మీద పేర్కొనాలని జగన్‌ సూచించారు.