ఫీజుల నియంత్రణపై జగన్‌ కీలక నిర్ణయం

ఫీజుల నియంత్రణపై జగన్‌ కీలక నిర్ణయం

రాష్ట్రంలో తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతూనే తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తామన్నారు. తనకు అత్యంత ప్రాధాన్యమైన దాంట్లో విద్యా రంగం ఒకటన్న జగన్‌.. పిల్లలకు యూనిఫారాలు, పుస్తకాలు సకాలంలోనే ఇస్తామని చెప్పారు. 

విద్యార్థులకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని,  ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని జగన్‌ చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు తప్పనిసరి అని స్పష్టం చేసిన జగన్‌.. కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో ఉపాధ్యాయులు కూడా ఉండాలని అన్నారు. జనవరి 26 నుంచి 'అమ్మఒడి' చెక్కుల పంపిణీ జరుగుతుందని చెప్పారు.