ఆ మాటలే స్ఫూర్తి: జగన్ 

ఆ మాటలే స్ఫూర్తి: జగన్ 

దేశానికి సేవ చేయడమంటే దేశంలోని కోట్లాదిమందికి సేవ చేయడమేనని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇవాళ ఆయన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ ఆకాంక్షలను గుర్తు చేసుకున్నారు. పేదరికాన్ని, అజ్ఞానాన్ని, వ్యాధులను, అవకాశాల్లో అసమానతలను రూపుమాపకుండా దేశానికి సేవ చేశామనడంలో అర్థం లేదన్నారు. తమ పార్టీ ప్రతి అడుగుకూ ఇవే మార్గదర్శకాలని చెప్పారు. వైఎస్సార్ పాలనకు, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలకు, కూడా మహాత్ముడి ఆకాంక్షలే మార్గదర్శకంగా నిలిచాయని జగన్‌ అన్నారు.