ఏపీలో ఈ ఉద్యోగుల వేతనాలు పెంపు

ఏపీలో ఈ ఉద్యోగుల వేతనాలు పెంపు

ఉద్యోగులపై ఏపీ సీఎం జగన్‌ వరాల జల్లు కురిపించారు. ఇవాళ జరిగిన కేబినెట్‌లో పలువురు ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్య, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులకు భారీగా వేతనాలు పెంపునకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 
ఈ అంశాలపై ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తూ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..

  • ఉద్యోగులకు ఐఆర్ 27 శాతం.
  • మున్సిపల్ వర్కర్లకు రూ. 2 వేల నుంచి రూ.18 వేలకు వేతనాల పెంపు.
  • అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 నుంచి రూ.11,500కు వేతనం పెంపు.
  • అంగన్వాడీ ఆయాలకు రూ. 6వేల నుంచి రూ.7 వేలకు వేతనం పెంపు.
  • హోంగార్డులకు రూ. 18 వేల నుంచి రూ. 23వేలకు వేతనం పెంపు.
  • కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు రూ. 400 నుంచి రూ. 4 వేలకు వేతనం పెంపు.
  • అర్హత బట్టి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.
  • అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల రద్దు. ప్రస్తుత అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత.