'హోదా'పై అసెంబ్లీలో కీలక తీర్మానం

'హోదా'పై అసెంబ్లీలో కీలక తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ వద్దని, ప్రత్యేక హోదాయే కావాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా  ప్రత్యేక హోదాపై  స్టేట్‌మెంట్‌ను జగన్‌ చదవి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 కోట్ల మంది తరఫున కేంద్రానికి తీర్మానం ఇస్తున్నానన్నారు. 

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చని అన్నారు. విభజన వల్ల సుమారు 59 శాతం జనాభాను, అప్పులను వారసత్వంగా పొందామని.. కానీ 47 శాతం ఆదాయం మాత్రమే పొందామని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల లాభాలను వివరించిన జగన్‌.. ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్‌తో టీడీపీ ప్రభుత్వం సంప్రదింపులు జరపకపోవడం వల్లే హోదా రాలేదన్నారు.