డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలి

డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలి

ఏపీ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై వైసీపీ అధినేత జగన్ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్‌ను కలిసినవారిలో వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కొలుసు పార్థసారధి, రాజన్న దొర తదితరులు ఉన్నారు.