'అవినీతి మంత్రుల'పై జగన్‌ కీలక నిర్ణయం

'అవినీతి మంత్రుల'పై జగన్‌ కీలక నిర్ణయం

ఇకపై మంత్రులెవరైనా పొరపాటు చేసినా, అవినీతికి పాల్పడినా తక్షణమే విచారణ జరిపి సస్పెండ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ఇవాళ అమరావతిలో జరిగిన కేబినెట్‌ భేటీలో ఈమేరకు ఆయన తెలియజేశారు. ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని.. విలేఖరులకు వెల్లడించారు. అవినీతి మరక అంటిన మంత్రులపై కఠిన చర్యలు తప్పవని కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారని ఆయన చెప్పారు. మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించి ప్రతి నిర్ణయాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని నిర్ణయించామన్నారు. జుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటుపైనా కేబినెట్‌లో చర్చించామని ఆయన చెప్పారు.ఇక.. అవినీతిని బయటపెడితే అధికారులతో పాటు మంత్రులకూ సన్మానం చేయాలని నిర్ణయించామన్నారు.