ఆటో నడిపిన జగన్‌..

ఆటో నడిపిన జగన్‌..

వైసీపీ అధినేత జగన్‌ ఇవాళ సరదాగా ఆటో నడిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా  పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద పలువురు ఆటోడ్రైవర్లు.. జగన్‌ను కలిశారు. ఆటో డ్రైవర్లకు అండగా ఉంటానని ఈ సందర్భంగా జగన్‌ హామీ ఇచ్చారు. వెంటనే ఆటో డ్రైవర్లంతా జగన్‌ను ఆటో ఎక్కించారు. ఆ తర్వాత ఖాకీ చొక్కా(ఆటో యూనిఫారం) వేసుకుని జగనే స్వయంగా ఆటో నడిపారు. సొంత ఆటో ఉన్న  ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.