వారికి జగన్ గుడ్ న్యూస్..100 మాత్రమే ఫైన్ ! 

వారికి జగన్ గుడ్ న్యూస్..100 మాత్రమే ఫైన్ ! 

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలన్నింటినీ విడిచి పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి. వాహనదారుల నుంచి 100 రూపాయల జరిమానా వసూలు చేయాలని పోలీసులకు సూచించారు. మళ్లీ నిబంధనలు ఉల్లంఘించబోమని వాహనదారుల నుంచి హామీపత్రాన్ని తీసుకోవాలని ఆదేశించారు సీఎం. వాహనాలు ఇచ్చే సమయంలో కొవిడ్‌ 19 జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఇక కరోనా వైరస్‌ సోకడం పాపం, నేరం కాదన్న జగన్‌. ఇది ఎవరికైనా వ్యాపిస్తుందని కరోనా వ్యాప్తి కట్టడిపై అధికారులతో జరిపిన సమీక్షలో తెలిపారాయన. కొవిడ్‌ పట్ల ప్రజల్లో భయాందోళన తొలగించాలని అధికారులుకు సూచించారు. పరీక్షలకు స్వచ్ఛందంగా జనం ముందుకు రావాలని, కనీస జాగ్రత్తలు, వైద్య సాయంతో ఈ మహమ్మారి నుంచి కోలుకోవడం సులభమేనన్నారు సీఎం జగన్.