జగన్ మరో కీలక నిర్ణయం... వారికి పండగే...!!

జగన్ మరో కీలక నిర్ణయం... వారికి పండగే...!!

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  ముఖ్యంగా గత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వదిలేసిన వాటిని తెరమీదకు తీసుకొచ్చి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.  ఇప్పటి వరకు పండ్లు, పూల తోటల విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి.  

భూసేకరణ జరిగినపుడు పండ్లు, పూల తోటలు ఉంటె వారికి అందినే నష్టపరిహారం చాలా తక్కువగా ఉండేది.  కానీ, జగన్ ఇప్పుడు దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.  నష్టపరిహారాన్ని ఇప్పుడున్నడానికి మూడింతలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో మామిడి చెట్టుకు రూ. 2600 మాత్రమే ఇచ్చేవారు.  కానీ, ఇప్పుడు ఆ ధర మూడు రేట్లు పెరిగింది.  వీటితో పాటుగా కొబ్బరి, నిమ్మచెట్టుకుకు కూడా పరిహారం మూడింతలు చేయడం విశేషం.  ఇది రైతులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి.