ఫోన్ లు కొనాలనుకునే మహిళలకి జగన్ బంపర్ ఆఫర్

ఫోన్ లు కొనాలనుకునే మహిళలకి జగన్ బంపర్ ఆఫర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాని కోసం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అలానే దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. అలానే దిశయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేవారికి, ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో మహిళా దినోత్సవం రోజున మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసే మహిళలకు 10 శాతం రాయితీ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఇక మహిళా భద్రత, సాధికారితపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. దిశ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. కాలేజీల్లో దిశపై ప్రచార  హోర్డింగులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. హోర్డింగుల్లో దిశ యాప్‌ సహా అన్ని రకాల వివరాలు ఉంచాలని సీఎం ఆదేశించారు. దిశ కింద తీసుకుంటున్న  చర్యల అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ ఆదేశించారు.