టీచర్ల బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్ :ఆదిమూలపు సురేష్

 టీచర్ల బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్ :ఆదిమూలపు సురేష్

ఏపీలో టీచర్ల బదిలీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం ఆదేశాలు మేరకు బదిలీలు చేపడతామని అన్నారు. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్లు బదిలీ ప్రక్రియ ఉంటుందన్నారు. బదిలీల కోసం టీచర్లు ఎవరి చుట్టు తిరగక్కలేదన్నారు. పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాక స్కూల్స్ ప్రారంభం లోపు బదీలీలు ఉంటాయని తెలిపారు. నాడు నేడు కోసం మొదటి దశలో రూ. 3700 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నాడు నేడు కార్యక్రమాన్ని జులై చివరకి పూర్తి చేస్తామని  చెప్పారు. ఇప్పటికే చాలా చోట్ల పనులు ఊపందుకున్నాయని మొదట దశలో నాడు నేడు కింద 15700 మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. నాడు నేడు మీద సీఎం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. నాడు నేడుకు సంబంధించిన   టెండర్లు ఇప్పటికే పూర్తి చేశామని ఫర్నిచర్ నాణ్యతను సీఎం పరిశీలించారన్నారు. జగన్న గోరు ముద్ద కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు లేరన్న సాకుతో స్కూళ్ళు మూసివేయడం లేదన్నారు.గత ప్రభుత్వం హయాంలో 7వేలకుపైగా వేల స్కూళ్లు మూసేసారని... ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం చెప్పారని అన్నారు. జగనన్న గోరు ముద్ద పారిశుధ్యం కోసం యాప్ ప్రారంభిస్తున్నామని అన్నారు.