కరువుపై జగన్‌ ప్రజెంటేషన్‌

కరువుపై జగన్‌ ప్రజెంటేషన్‌

కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నామని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఇవాళ ఆయన కరువుపై ప్రసంగించారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర కరువు వచ్చిందన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 
గత ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్ల రాష్ట్రంలో రైతుల రుణాలు రూ.లక్షా49 వేల కోట్లకు చేరాయని, కరువును ఎదుర్కోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని జగన్‌ విమర్శించారు. 'గత ప్రభుత్వం స్పందించని కారణంగానే విత్తనాల కొరత ఏర్పడింది. మా ప్రభుత్వం వచ్చేనాటికి కేవలం 50 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు మాత్రమే ఉన్నాయి' అని చెప్పారు జగన్‌.