ఎమ్మెల్యేలకు జగన్‌ కీలక సూచన

ఎమ్మెల్యేలకు జగన్‌ కీలక సూచన

గ్రామాల్లో నీటి ఎద్దటి నివారణకు ప్రతి నియోజకవర్గానికీ రూ.కోటి కేటాయిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా రూ.కోటి ఇస్తామని.. దీనిని సీఎం అభివృద్ధి నిధి నుంచే కేటాయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు ముఖ్యమంత్రి. ప్రతి ఎమ్మెల్యే వారి నియోజవర్గాల్లో పర్యటించి నీటి ఎద్దడి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు.