మా దగ్గర ఆధారాలున్నాయ్‌: జగన్‌

మా దగ్గర ఆధారాలున్నాయ్‌: జగన్‌

సభా సాక్షిగా సున్నా వడ్డీ పథకంపై  నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఈ అంశంపై చర్చకు అనుమతించాలంటూ ఆయన  స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను కోరారు. సున్నా వడ్డీ రుణాలపై ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించారంటూ టీడీపీ సీఎంపై సభా హక్కుల నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇవాళ అసెంబ్లీలో మాట్లాడారు. సున్నా వడ్డీకి జవాబు చెప్పలేకే చంద్రబాబునాయుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. టీడీపీ హాయంలో సున్నా వడ్డీపై తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు జగన్‌.