పర్సనాలటీలు కాదు.. బుద్ధి పెరగాలి: జగన్‌

పర్సనాలటీలు కాదు.. బుద్ధి పెరగాలి: జగన్‌

శరీరాలు కాదు.. బుద్ధి పెరగాలని, కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడబోమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అసెంబ్లీలో ఇవాళ 'సున్నా వడ్డీల'పై వాదోపవాదాలు జరిగాయి. జగన్‌ మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అసెంబ్లీలో మీ బలం ఎంత.. మా బలం ఎంత? 150 మంది ఉన్నాం.. తామంతా లేస్తే.. మీ స్థానాల్లో కూడా కూర్చోలేరు. మేం తలచుకుంటే మీరు ఒక్కమాట కూడా మాట్లాడలేరు' అని జగన్‌ అన్నారు. 

ప్రతిపక్షం బుద్ధి లేకుండా ప్రవర్తిస్తోందని, తప్పు చేసిన వాళ్లు ఎలా ప్రవర్తిస్తారో టీడీపీ సభ్యులను చూస్తే తెలుస్తోందని జగన్‌ వ్యాఖ్యానించారు.  చంద్రబాబు ఎలా ఉంటారో.. వారి సభ్యులు కూడా అలానే ఉన్నారన్న జగన్‌.. సున్నా వడ్డీ పథకాన్ని గొప్పగా అమలు చేసినట్టు బాబు చెప్పడాన్ని తప్పుబట్టారు. అంతకముందు వైసీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి..చంద్రబాబుపై విమర్శలు చేశారు. 40 ఏళ్ల అనుభవం కాదు.. సంస్కారం ఉండాలంటూ ఎద్దేవా చేశారు.