బాబుపై జగన్‌ ఆగ్రహం

బాబుపై జగన్‌ ఆగ్రహం

అసెంబ్లీలో ప్రతి రోజూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ శాసనసభలో ఆయన మాట్లాడుతూ ప్రతి విషయాన్నీ వివాదంగా మార్చడం తప్ప సభలో చర్చ జరపాలన్న ఉద్దేశం ప్రతిపక్షానికి లేదని అన్నారు. ప్రతి రోజు ఇదే తరహాలో టీడీపీ సభ్యుల ప్రవర్తన ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తున్నామన్నారు జగన్‌. మేనిఫెస్టోను తు.చ అమలు చేస్తున్నందున తమకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో బాబు ప్రవర్తిసున్నారని అన్నారు. తమను అభినందించాల్సిందిపోయి తమ మాటలను వక్రీకరిస్తున్నారని జగన్‌ అసహనం వ్యక్తం చేశారు.