ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కారానికి ఇకపై ప్రతి సోమవారం 'స్పందన' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అమరావతిలో ఇవాళ నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈమేరకు వివరాలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్లు సోమవారం ఎటువంటి అధికారిక సమావేశం పెట్టుకోవద్దని..  పైఅధికారులు కూడా ఆ రోజు కలెక్టర్లకు ఫోన్లు చేయరని స్పష్టం చేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అమలయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించి జగన్‌ కీలక సూచనలు చేశారు.  

కేవలం కలెక్టరేట్‌కే పరిమితమవకుండా జిల్లాల్లో ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రతి నెలా మూడో శుక్రవారం చిన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను కలెక్టర్లు విని పరిష్కరించాలని సూచించారు.  అలాగే.. ఐఏఎస్‌ అధికారులు వారంలో ఓ రోజు రాత్రి ఆకస్మిక తనిఖీ చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, హాస్టళ్లల్లో నిద్ర చేయాలని స్పష్టం చేశారు.