కేబినెట్‌ విస్తరణపై జగన్‌ ఏమన్నారంటే..

కేబినెట్‌ విస్తరణపై జగన్‌ ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన వైసీపీ అధినేత జగన్‌ ప్రమాణస్వీకారం చేయబోతున్న నేపథ్యంలో కేబినెట్‌ కూర్పుపై పలురకాల వార్తలొచ్చాయి. జగన్‌తోపాటు పలువురు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని పలువురు భావించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై జగన్‌ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. 30న తానొక్కడినే ప్రమాణం చేస్తానని.. వారంపదిరోజుల్లో కేబినెట్‌ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ మేరకు స్పష్టం చేశారు. మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి శ్వేతపత్రాలను విడుదల చేస్తామని జగన్‌ తెలిపారు. మరోవైపు.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.