అమరావతి, పోలవరంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు

అమరావతి, పోలవరంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు

అమరావతి, పోలవరం నిర్మాణాల్లో 'సెన్సేషనల్‌ స్కామ్‌' జరిగిందని వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం జగన్‌ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఇవాళ ఆయన ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌'తో వేల కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. 

'ఫలానా చోట రాజధాని వస్తుందని బాబుకు ముందే తెలుసు. కానీ.. రాజధాని వేరే చోట వస్తుందని ప్రచారం చేయించి అమరావతి ప్రాంతంలో తన సన్నిహితులు, బినామీలతో భూములు కొనుగోలు చేయించారు. ఆ తర్వాత రాజధానిని ప్రకటించారు. హెరిటేజ్‌ కంపెనీ సైతం 14 ఎకరాలు కొనుగోలు చేసింది' అని జగన్‌ తెలిపారు. ల్యాండ్‌ పూలింగ్‌ అని చెప్పి ఒత్తిడి తెచ్చి రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారన్న జగన్‌.. తన సన్నిహితుల భూములను మాత్రం పూలింగ్‌ నుంచి మినహాయించారని చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.  

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే పోలవరం నిర్మాణం జరాగాల్సిన అవసరం లేదన్న జగన్.. పోలవరం టెండర్లలో కుంభకోణం జరిగి ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు.  రివర్స్ టెండర్ విధానంలో తక్కువ రేట్లకు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక.. దేశంలోనే ఏపీని రోల్‌మోడల్‌గా నిలుపుతామని చెప్పాన జగన్‌.. ఏపీకి కేంద్రం నుంచి ఇంకా రూ.4000 కోట్లు రావాలన్నారు. ఏపీ హక్కుల సాధనకు నిరంతరం ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.