జగన్‌కు పోటీచేసే అర్హత కూడా లేదు..

 జగన్‌కు పోటీచేసే అర్హత కూడా లేదు..

జగన్‌ ఓటు హక్కు రద్దు చేయాలని దాఖలు చేసిన ఫారమ్‌ -7 సరైనదేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. జగన్‌కు పోటీచేసే అర్హత కూడా లేదని అన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డిని కాపాడమని ప్రధాని మోడీనుంచి ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. జగన్‌ చెప్పినట్లు సీబీఐ చేయాలని కూడా ప్రధాని సూచించినట్లు పేర్కొన్నారు. అందుకే టీడీపీ సానుభూతి పరుల కంపెనీలపై సీబీఐ దాడులు చేపట్టినట్లు తెలిపారు. జగన్‌ పాస్‌పోర్టు హైదరాబాద్‌లో ఉందని.. ఆయన డొల్ల కంపెనీల చిరునామా బెంగళూరులోని ప్యాలెస్‌ల పేరుతో ఉన్నాయని ఆయన ఆరోపించారు. 

ఇందుజా భూములపై నేడు పత్రికల్లో వచ్చిన కథనాలకు వైసీపీ నేత విజయ్‌సాయి రెడ్డి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నేడు 11 గంటలకు టికెట్లు ఇస్తానని చెప్పిన జగన్‌ మళ్లీ దానిని 16కు వాయిదా వేయడానికి ఉలుకుబాటే కారణమన్నారు. దొంగతనం బయటపడిన 24గంటలు దొంగ గందరగోళంలో ఉంటాడని ఎద్దేవా చేశారు. అందుకే టికెట్ల పంపిణీని వాయిదా వేసినట్లు తెలిపారు. దీనికి విజయసాయి రెడ్డి సమధానం చెప్పకపోతే రోజూ ఇదే విషయాన్ని ప్రశ్నిస్తానని అన్నారు. మోడీ దేశానికి కాపలాదారుడా.. జగన్‌మోహన్‌ రెడ్డికి కాపలాదారుడా..? అని ప్రశ్నించారు.