అసెంబ్లీలో అటెండెన్స్‌.. జగన్‌ కీలక నిర్ణయం..!

అసెంబ్లీలో అటెండెన్స్‌.. జగన్‌ కీలక నిర్ణయం..!

టీడీపీపై అసెంబ్లీలో మరింత దూకుడుగా వెళ్లాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈమేరకు పలు విషయాల్లో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రతి సభ్యుడూ ఏ టైంకి వచ్చారు.. ఏ టైంకి వెళుతున్నారనే అంశంపై దృష్టి పెట్టాలని చీఫ్ విప్‌కి జగన్‌ సూచించారు. ఈ వివరాలతో ప్రతిరోజూ సాయంత్రం తనకి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో చేస్తున్న విమర్శలు చేస్తున్న సమయంలో ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండం లేదని జగన్ భావించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల హాజరుపై జిల్లా మంత్రులకి ఆయన బాధ్యత అప్పగించారు.