న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తా: జగన్ 

న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తా: జగన్ 

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం శనివారం కలిసింది. శుక్రవారం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య, టీడీపీ హాయంలో జరుగుతున్న రాజకీయ హత్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ..వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. వివేకానంద హత్య కేసులో నిజాలు బయటికి రావాలంటే సీబీఐకి అప్పగించాలని అన్నారు. చంద్రబాబు హస్తం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు రిపోర్టు చేయని వ్యవస్థతో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తుగా మారిందని ఆరోపించారు. వైఎస్ వివేకానంద హత్యకేసులో న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తామని జగన్ స్పష్టం చేశారు.