జగన్‌తో జీవీఎల్‌ భేటీ..

జగన్‌తో జీవీఎల్‌ భేటీ..

ఏపీ సీఎం జగన్‌ను బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఇవాళ కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జీవీఎల్‌ మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశానని.. రాష్ట్రాభివృద్ధి, సమస్యలపైన మాట్లాడానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం సహకారంపై చర్చించామన్న ఆయన.. రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీ ఎంపీకి ఇచ్చే విషయమై తనకు సమాచారం లేదని జీవీఎల్‌ తెలిపారు.